అక్షరటుడే, ఆర్మూర్: వాస్తు పేరిట ఆర్మూర్ బల్దియా ప్రధాన ప్రవేశ ద్వారాన్ని మారుస్తూ నిధులను వృథా చేస్తున్నారు. గతంలో ముందువైపు నుంచి ఎంట్రెన్స్ మార్గం ఉండగా . దానిని మూసివేసి వెనుక వైపు ఏర్పాటు చేశారు. చైర్ పర్సన్ మార్పుతో తిరిగి మరోసారి ముందు వైపు నుంచి ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా బల్దియాలో చైర్మన్లు, అధికారులు మారినప్పుడల్లా వాస్తు పేరిట ప్రవేశ ద్వారాలను మార్చడం చర్చకు దారి తీసింది. వాస్తు పేరిట ఎవరికి వారు ప్రభుత్వ సొమ్మును వృథా చేస్తుండడంతో పట్టణ ప్రజలు పెదవి విరుస్తున్నారు.