అక్షరటుడే, ఇందూరు: నగరంలోని అర్సపల్లి రామర్తి చెరువును కబ్జాల నుంచి కాపాడాలని అర్సపల్లి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నర్సయ్య కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అర్సపల్లి రామర్తి చెరువు సర్వే నెంబరు 216లో 29 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నారు. చెరువు స్థలమంతా కబ్జాకు గురైందని అనేకసార్లు అధికారులకు వినతిపత్రం అందించినా స్పందన లేదన్నారు. కనీసం గణేశ్ నిమజ్జనం చేసేందుకు కూడా దారిలేకుండా ఆక్రమించి కట్టడాలు నిర్మించారన్నారు . అలాగే గాడికుంట చెరువు 6 ఎకరాల స్థలంలో ఉండగా సుమారు మూడు ఎకరాలు కబ్జాకు గురైందని ఆరోపించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సాయన్న, నవీన్, బీరప్ప, గంగాధర్, శోభన్ తదితరులు పాల్గొన్నారు.