అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ కొత్త బస్టాండ్ ప్రాంతంలోని పలు హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మంగళవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ట్రేడ్ లైసెన్స్ లేని వారికి నోటీసులు జారీ చేశారు. అలాగే హోటళ్లలో పరిశుభ్రత పాటించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని సూచించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజినీర్ పూర్ణమౌళి, వార్డు ఆఫీసర్ పృథ్వీరాజ్, సిబ్బంది అక్షయ్, రాము, నర్సయ్య, ప్రశాంత్, రవి, రమేష్ పాల్గొన్నారు.