అక్షరటుడే, బాసర: మాఘ శుద్ధ పాడ్యమి శుభ ముహూర్తం, ఆదివారం కలిసి రావడంతో నిర్మల్ జిల్లా బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి అలిశెట్టి లక్ష్మినారాయణ కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. మరోవైపు 14న వసంత పంచమికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.