అక్షరటుడే, భిక్కనూరు: తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్న తమను తొలగించి కొత్తవారిని తీసుకుంటామని భిక్కనూరు టోల్ ప్లాజా యాజమాన్యం ప్రకటించడంతో కార్మికులు గురువారం ధర్నా ప్రారంభించారు. టోల్ ప్లాజా ఆందోళన చేపట్టారు. ఏళ్లుగా తాము టోల్ ప్లాజాలో సేవలందించామని.. అకస్మాత్తుగా తమను తొలగించి కొత్త వారి కోసం ప్రకటన ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏ ఒక్క కార్మికుడిని తొలగించినా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో టోల్ ప్లాజా కార్మిక సంఘం అధ్యక్షుడు కాసర్ల నర్సాగౌడ్ ఉపాధ్యక్షులు సిద్ధ రాములు, సాయి నిఖిల్, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి బల్వంత్ రెడ్డి, ప్రతినిధులు నీలా, రఘు, భానురాజు తదితరులు పాల్గొన్నారు.