అక్షరటుడే, బోధన్: పట్టణంలోని ప్రాచీన ఏకచక్రేశ్వరాలయ వార్షికోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మహారుద్రాభిషేకం, రుద్రహోమం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్ బీర్కూర్ శంకర్, అర్చకులు గణేశ్ మహరాజ్, సంతోష్ శర్మ, మహేశ్ పాఠక్, శికుమార్, జేఏవో రాములు, ధర్మకర్త మండలి సభ్యుడు లక్ష్మణ్ పటేల్ పాల్గొన్నారు.