అక్రమ రిజిస్ట్రేషన్లు చేసే వారిపై కఠిన చర్యలు

0

అక్షరటుడే, బోధన్: అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బోధన్ పట్టణంలో బుధవారం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సుదర్శన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తప్పు చేసే అధికారులను వదిలే ప్రసక్తిలేదని, ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరిస్తున్న అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గిరిజన సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.