బీజేపీలోకి ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు

0

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ కు చెందిన ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. నిచ్చెంగి లత, బట్టు రాఘవేందర్ మంగళవారం ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ కూలాచారి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే వీరివురు కూడా గతంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారే. మరి కొంత మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.