Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ నెల 17న ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్​లో మంగళవారం మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్​తో కలిసి వృక్షార్చన వాల్​పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవడమే కేసిఆర్​కు ఇచ్చే పుట్టినరోజు కానుక అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ ఆఫీస్ సెక్రెటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, బిగాల గణేశ్​ గుప్తా, శంకర్ నాయక్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో–ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Advertisement