ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత పేరును సీబీఐ నిందితుల జాబితాలో చేర్చింది. ఈ నెల 26న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కవితకు మొదట సీబీఐ నోటీసు ఇచ్చింది. తాజాగా ఆ నోటీసును సవరిస్తూ నిందితురాలిగా పేర్కొంది. గతంలోనే సీబీఐ కవితను ఆమె ఇంట్లో విచారణ జరిపింది. ఆ తర్వాత ఈడీ విచారణను సైతం ఎదుర్కొన్నారు. తదనంతరం ఎమ్మెల్సీ కవిత సుప్రీం తలుపుతట్టారు. ప్రస్తుతం ఆమె దాఖలు చేసిన పిటీషన్ సుప్రీంలో విచారణ దశలో ఉంది. ఈ నెల 28న కోర్టులో విచారణ జరగనుంది. ఇంతలోనే కవిత పేరును లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా పేర్కొనడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తదుపరిగా కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.