అక్షరటుడే, వెబ్డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, ప్రతిపక్ష పార్టీలు దీనికి సిద్ధమేనా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ‘బీసీలకు ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి.. అందుకే చట్టప్రకారం ఇవ్వడం సాధ్యం కాకపోయినప్పటికీ.. పార్టీ పరంగా తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.