అక్షరటుడే, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించడం లేదని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఉన్నందున ప్రభుత్వం సెలవు ప్రకటించిందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు.