అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 141 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం డీ-వార్మింగ్ డేను పురస్కరించుకుని జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను కలెక్టర్​ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో రాజశ్రీ, అధికారులు పాల్గొన్నారు.