అక్షరటుడే, ఇందూరు: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను తొందరగా పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్ ఇన్ఛార్జి డీపీవో శ్రీనివాస్ లకు విన్నపించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.