అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 94 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, ఇన్ ఛార్జి డీపీవో శ్రీనివాస్‌లు ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.