Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి నాయస్థానం జైలు శిక్ష విధించింది. ఒకటో టౌన్ సీఐ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని నెహ్రూ పార్క్ వద్ద డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా బబ్లు అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు. అతడిని న్యాయస్థానం ముందు హాజరపరచగా రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు విధించినట్లు ఎస్హెచ్వో తెలిపారు.
Advertisement