అక్షరటుడే, వెబ్ డెస్క్: పోలీసు శాఖ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. విధుల్లో ఏ చిన్న తప్పిదం చేసినా సత్వరమే చర్యలుంటాయి. కానీ, కమిషనరేట్ లో ఓ సీఐ వ్యవహారశైలి రోజురోజుకి మితిమీరుతోంది. ముఖ్యంగా మద్యం మత్తులో ఆయన విధులు నిర్వర్తించడమే కాకుండా పలువురు ఫిర్యాదుదారులను బెదిరింపులకు గురి చేస్తున్న ఘటనలు ఉన్నాయి. విధులు నిర్వర్తించేది క్రైమ్ విభాగంలో కాగా.. తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా పోలీసు స్టేషన్ల కేసుల్లో తలదూర్చుతున్నారు. తాజాగా ఓ స్టేషన్ పరిధిలో చోరీ కేసును ఛేదించగా.. ఫిర్యాదుదారుల వద్దకు మద్యం మత్తులో వెళ్లి దుర్భాషలాడినట్లు తెలిసింది. దీంతో వారు నాలుగో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా చివరకు రాజీ కుదిర్చారు. ఇలా.. మద్యం మత్తులో ఆయన వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతోంది. తాజాగా ఇతనిపై ఓ మహిళ సైతం పలు ఆరోపణలు చేసింది. రోజురోజుకి సీఐ తీరు పోలీసు ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఓ ఏసీపీని విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
Advertisement
Advertisement