అక్షరటుడే, ఇందూరు: నగరంలోని పెద్దబజారులో గల లక్ష్మీనరసింహ కిరాణా దుకాణంలో సైబర్ నేరం జరిగింది. శనివారం షాప్ కు వచ్చిన ఓ వ్యక్తి తాను ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగినంటూ యజమానిని నమ్మించాడు. కరెంట్ అకౌంట్ తో పాటు క్యూఆర్ కోడ్ అప్డేట్ చేయాలని చెప్పి..ఆధార్, పాన్ కార్డు వివరాలు అడిగాడు. అనంతరం యాప్ డౌన్లోడ్ చేస్తానని నమ్మించి ఫోన్ తీసుకున్నాడు. దుకాణం యజమాని గిరాకీ బిజీలో ఉండగా.. సదరు మోసగాడు ఫోన్ తో సహా పరారయ్యాడు. కాసేపటికి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.లక్ష మయమైనట్లు గుర్తించిన బాధితుడు రాజ్ కుమార్ రెండో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మాయమాటలు చెప్పి.. రూ.లక్ష మాయం
Advertisement
Advertisement