అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం మధ్యాహ్నం(భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలు) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి సైనిక విమానంలో వాషింగ్టన్‌కు చేరుకున్నారు. ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశారు. వాషింగ్టన్‌లో 25 వేల మందితో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నిన్న వంద మంది ప్రముఖులకు ట్రంప్‌ విందు ఇచ్చారు. ట్రంప్‌ విందుకు అంబానీ దంపతులు హాజరయ్యారు.