అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ ఎక్సైజ్ పోలీసులు పెద్దమొత్తంలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రముఖ హోటల్ వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో వ్యాగనార్ కారులో తరలిస్తున్న రెండు కిలోల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా రాజస్థాన్‌కు చెందిన భవానిసింగ్‌గా గుర్తించారు. అల్ప్రాజోలంను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన సుదర్శన్‌కు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు నిందితుడు తెలిపాడు. ప్రస్తుతం సుదర్శన్ పరారీలో ఉన్నాడు. పట్టుబడిన అల్ప్రాజోలం విలువ రూ.20 లక్షలకు పైగా ఉంటుందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. తనిఖీల్లో అధికారులు చంద్రభాను నాయక్, స్వప్న, వెంకటేశ్, విక్రమ్‌కుమార్, నర్సింహాచారి, సిబ్బంది రాజన్న, హమీద్, ఉత్తమ్, శివ, విష్ణు, అవినాష్, గంగారాం, లక్ష్మణ్ పాల్గొన్నారు.