ఆస్పత్రి ఐసీయూలో రోగి బంగారం మాయం

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలోని ద్వారకానగర్ లో గల సుఖీభవ ఆస్పత్రిలో చోరీ జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగికి సంబంధించిన రెండు తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఈ విషయమై రోగి కుటుంబీకులు ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు అందిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నట్లు ఒకటో టౌన్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ విజయ్ బాబు తెలిపారు. సీసీ టీవీ దృశ్యాలు పరిశీలిస్తున్నారు. ఆస్పత్రిలోని ఐసీయూలోకి బయటి వ్యక్తులు వెళ్లే ఆస్కారం లేదు. సిబ్బంది ఎవరైనా చేతివాటం ప్రదర్శించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.