అక్షరటుడే, వెబ్‌డెస్క్: గూగుల్ కంపెనీ అమెరికా బయట తొలి రిటైల్ స్టోర్‌ను భారత్‌లో ప్రారంభించనుంది. ప్రస్తుతం ఈ కంపెనీకి అమెరికాలో ఐదు స్టోర్లు ఉన్నాయి. భారత్‌ను కీలక మార్కెట్‌గా చూస్తున్న గూగుల్ ఇక్కడ పది బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా దేశంలో రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. ముంబాయి, ఢిల్లీలలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. బెంగళూరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ స్టోర్లలో తన పిక్సెల్ స్మార్ట్ఫోన్లతో పాటు, ఇయర్ బడ్స్, వాచ్‌లను విక్రయించనుంది. యాపిల్ కంపెనీకి పోటీగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.