అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ లో దొంగలు ఏకంగా ఓ పోలీసు ఇంటికి కన్నం వేశారు. ఎనిమిది తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. నిజామాబాద్ రూరల్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. కమిషనరేట్ లోని ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న సాయన్న గూపన్ పల్లిలో నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం ఆయన విధులకు వెళ్లగా.. కుటుంబీకులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చొరబడిన దొంగలు బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఇంటి తలుపు తెరిచి ఉండడాన్ని గుర్తించిన పొరుగింటి వారు కానిస్టేబుల్ కు సమాచారం ఇచ్చారు. ఆయన ఇంటికి వచ్చి చూడగా చోరీ జరిగిన ఘటన బయటపడింది. పట్టపగలే పోలీసు ఇంట్లో దొంగతనం జరగడం గమనార్హం.