అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఇంగ్లాండ్​తో జరుగుతున్న ఆఖరి టీ‌‌20లో భారత్​ భారీ స్కోర్​ చేసింది. వాంఖడే మైదానంలో ఓపెనర్​ అభిషేక్​ శర్మ (135) సిక్స్​లు, ఫోర్లతో రెచ్చిపోవడంతో భారత్​ స్కోర్​ బోర్డు పరుగులు పెట్టింది. ​ ఇంగ్లాండ్​ బౌలర్లను ఊచకోత కోసిన ఈ ఓపెనర్​ తన కెరీర్​లో వేగవంతమైన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శివమ్​ దూబే 30, తిలక్​వర్మ 24 పరుగులతో రాణించడంతో భారత జట్టు 20 ఓవర్లలో 247 పరుగులు చేసింది. టీ 20లో భారత్​ తరఫున అత్యధిక స్కోర్​ చేసిన బ్యాటర్​గా అభిషేక్​ శర్మ నిలిచారు.