అక్షరటుడే, వెబ్డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడుతున్న తొలి మ్యాచ్లో మన బౌలర్లు విజృంభిస్తున్నారు. దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చాలాకాలం తర్వాత పునరాగమనం చేసిన మహ్మద్ షమీ ఈ మ్యాచ్లో తన సత్తా చాటాడు. తొలి ఓవర్లోనే వికెట్ తీసి భారత జట్టులో ఆనందం నింపాడు. తర్వాత ఓవర్లో హర్షిత్ రాణా బంగ్లా కెప్టెన్ను ఇంటికి పంపాడు. షమీ రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ కూడా ఇద్దరిని పెవిలియన్కు పంపడంతో బంగ్లాదేశ్ 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం బంగ్లా జట్టు 14 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది.