అక్షరటుడే, బాన్సువాడ: వర్ని మండలం జాకోర ప్రాథమిక సహకార సంఘం 13 మంది డైరెక్టర్ల కు గాను 10 మంది డైరెక్టర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మెజారిటీ డైరెక్టర్లు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ప్రస్తుత ఛైర్మన్ కృష్ణారెడ్డి తన పదవి కోల్పోవా ల్సి వచ్చింది. శనివారం ఉదయం సొసైటీలో నిర్వహించిన అవిశ్వాస తీర్మాన సమావేశానికి 10 మంది డైరెక్టర్లు హాజరయ్యారు. హాజరైన వారంతా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అవిశ్వాస పరీక్ష నెగ్గినట్లు ఎన్నికల అధికార శ్రీనివాసరావు ప్రకటించారు.