గాయత్రీ నగర్ లో దారుణం

0

అక్షరటుడే, నిజామాబాద్: నగరంలోని గాయత్రీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం కాలనీలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరగగా.. చిన్నపిల్లల కిడ్నాప్ కోసం వచ్చినట్లు ప్రచారం జరిగింది. కాగా స్థానికులు అతనిపై దాడి చేశారు. ఈ ఘటనలో సదరు వ్యక్తి మృతి చెందాడు. నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ ఘటనలపై జరుగుతున్న వదంతులను నమ్మవద్దని, భౌతిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సీపీ కల్మేశ్వర్ ప్రకటించినప్పటికీ.. ప్రజల్లో మార్పు రావట్లేదు. తాజా ఘటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. తదుపరిగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూస్తున్నారు.