అక్షరటుడే, నిజాంసాగర్: అంగన్​వాడీ కేంద్రాలను సమయపాలన పాటిస్తూ నిర్వహించాలని మండల ప్రత్యేకాధికారి శ్రీపతి ఆదేశించారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజారాహిల్స్ అంగన్​వాడీ కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నిజాంసాగర్, అచ్చంపేట గ్రామాల్లోని నర్సరీలను ఆయన పరిశీలించారు. ఎంపీడీవో గంగాధర్, పంచాయతీ కార్యదర్శి భీం​రావు, అంగన్​వాడీ టీచర్​ విజయలక్ష్మి తదితరులున్నారు.