Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండలంలోని తిమ్మారెడ్డి తండాలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏఎంసీ ఛైర్మన్​ రజిత వెంకట్రాం రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్​ సత్యనారాయణ అన్నారు. తిమ్మారెడ్డి తండాలో శుక్రవారం ప్రజలతో తండా సమస్యలపై సమావేశం నిర్వహించారు. అలాగే గ్రామంలోని సమస్యలను పరిశీలించారు. తండాలోని డ్రెయినేజీ, లైటింగ్, జీపీ బిల్డింగ్, సీసీ రోడ్డు వంటి సమస్యలున్నాయని తండావాసులు వివరించారు. దీంతో వారు స్పందిస్తూ సమస్యలను ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. వారి వెంట తిమ్మారెడ్డి తండా మాజీ సర్పంచ్ సంతోష్ నాయక్, తండా నాయకుడు రాములు నాయక్, శ్రీనివాస్ రెడ్డి, సామెల్ తదితరులున్నారు.

Advertisement