అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసినట్లు మెదక్ ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. మెదక్ పట్టణం ఫతేనగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదీర్, మహ్మద్ అబ్దుల్ షఫీ ఆన్లైన్ గేమ్‌లకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అప్పులు కావడంతో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరిపై హవేళి ఘనపూర్ మండలంలో మూడు, కామారెడ్డి జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిందితుల నుంచి 12 తులాల బంగారం రికవరీ చేశామని చెప్పారు.