అక్షరటుడే, బాన్సువాడ: బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కలేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బాన్సువాడ పట్టణంలో మంగళవారం ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేటీఆర్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. అధికారం కోల్పోవడంతో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. ఈ సమావేశంలో ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.