సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అసభ్య పదజాలం

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్ర ముఖ్యమత్రి రేవంత్ రెడ్డిపై బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అసభ్య పదజాలం ప్రయోగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోమవారం మిర్యాలగూడ సమావేశంలో పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి..”ఎవరూ ఊహించని పనులు చేసిన కేసిఆర్ పట్ల సీఎం రేవంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నేను అంటున్నా.. రేవంత్ రెడ్డి ఓ ..డా. నిజంగా సీఎం రేవంత్ మొనగాడు అయితే హామీలు అమలు చేసి చూపెట్టాలి. అది చేతగాకే ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు..” అని పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.