అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తుర్కియేలోని స్కీ రిసార్ట్ హోటల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 76 మందికిపైగా మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు కిటికీల నుంచి కిందకు దూకారు. బోలు నగరంలో చెక్కతో నిర్మించిన 12 అంతస్తుల ‘గ్రాండ్ కార్టల్ హోటల్‌’లో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో హోటల్‌లో 234 మంది ఉన్నారు. సెలవు రోజు కావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి హోటల్ యజమాని సహా 9 మందిని అరెస్టు చేసినట్టు తుర్కియే న్యాయ శాఖ మంత్రి ప్రకటించారు.