భానుడి భగభగలు..

Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: వేసవి సీజన్‌ ప్రారంభంలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. మార్చి రెండో వారంలోనే ఎండ తీవ్రత 40 డిగ్రీలకు చేరువైంది. దీంతో మధ్యాహ్నం పూట బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. పలు రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. తప్పని పరిస్థితిలో క్యాప్‌లు, స్కార్ఫ్ లు ధరించి బయటకు వస్తున్నారు. బుధవారం పగటి ఉష్ణోగ్రతలు 39.3 డిగ్రీలుగా నమోదైంది. ఇళ్లలో ఫ్యాన్లు వేసుకున్నా ఉపశమనం లభించకపోవడంతో కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Kukatpally | మంచి నీళ్లు అడిగి.. చైన్​ చోరీ

Advertisement