బీజేపీ నుంచి కార్పొరేటర్ సస్పెండ్!

Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలోని 19వ డివిజన్ కార్పొరేటర్ మీసాల సవితా శ్రీనివాస్ బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. పార్టీకి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యకలాపాలకు గాను ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసినట్లు దినేష్ తెలిపారు. కార్పొరేటర్ సవిత భర్త మీసాల శ్రీనివాస్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు గాను ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement