అక్షరటుడే, బోధన్: జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా మంగళవారం జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్ బోధన్ పట్టణంలోని ఆచంపల్లి చౌరస్తాను వివిధ శాఖల సమన్వయంతో సందర్శించారు. చౌరస్తా వద్ద ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులకు సూచించారు. బోధన్ పట్టణ సీఐ వెంకట్ నారాయణ, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, జాతీయ రహదారి ఏఈఈ సతీష్, ఐరాడ్ జిల్లా మేనేజర్ వర్ష నిహాంత్ ఉన్నారు.