అక్షరటుడే, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన లాస్ వెగాస్‌లోని హోటల్ వెలుపల టెస్లా సైబర్‌ ట్రక్ పేలడంతో ఒకరు మరణించారు. ఏడుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. లాస్ వెగాస్ షెరీఫ్ కెవిన్ మెక్‌మహిల్ విలేకరులతో మాట్లాడుతూ.. పెద్ద పేలుడు జరగడానికి ముందు ఎలక్ట్రిక్ వాహనం ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ గ్లాస్ ప్రవేశద్వారం వద్దకు వచ్చి ఆగిందన్నారు. ఆ తర్వాత బాణసంచా పేలుళ్ల మాదిరిగా చిన్న చిన్న పేలుళ్లు సంభవించాయని వివరించారు.