అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఆకాశంలో ఉండాల్సిన భారీ శాటిలైట్ ఇంటిమీద పడడంతో కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బీదర్ జిల్లా జలసంగి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంటిపై భారీ శైటిలైట్ పడింది. పేలోడ్ బెలూన్‌తో కూడిన ఈ శాటిలైట్ గ్రామం నడిబొడ్డున పడడం.. మిషిన్‌లో రెడ్‌లైట్ వెలుగుతుండడంతో ప్రజలంతా భయపడ్డారు. కాని అందులో ఉన్న ఉత్తరం ద్వారా.. ఆ బెలూన్‌ను టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ హైదరాబాద్ నింగిలోకి వదిలినట్లు తెలిసింది.