అక్షరటుడే, వెబ్‌డెస్క్: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రాజధాని వాషింగ్టన్ డీసీలో రోనాల్డ్ రీగన్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సైనిక హెలికాప్టర్‌ను PSA ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం ఢీకొట్టింది. దీంతో విమానం సమీపంలో ఉన్న పొటామక్ నదిలో కూలిపోయింది. ప్రమాద సమయంలో ఫ్లైట్‌లో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో మృతుల వివరాలు తెలియరాలేదు. విమానం కూలిపోయిన పొటామక్ నదిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.