అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలోని విద్యుత్తు అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. పెద్దబజార్ లక్ష్మీ మెడికల్ చౌరస్తాలో ఓ విద్యుత్తు స్తంభానికి షాక్ వస్తుందని స్థానికులు గుర్తించారు. శనివారం ఈ విషయమై విద్యుత్తు అధికారులకు సమాచారం ఇచ్చారు. అయినా సిబ్బంది సమస్య పరిష్కరించకుండా వెళ్లిపోయారు. అనంతరం స్థానికులు ఎలక్ట్రిసిటీ పోల్ కు విద్యుత్తు వైర్లు పెట్టగా ఓ బల్బు వెలిగింది. ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి అంటూ.. స్థానికులు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేర్చారు. నెటిజన్లు విద్యుత్తు తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా అని మండిపడుతున్నారు. మరోవైపు వర్ని మండలంలో ఓ విద్యుత్తు స్తంభానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా పలు గొర్రెలు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. అయినప్పటికీ.. సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనార్హం.
ప్రాణాలు పోతేనే స్పందిస్తారా..!
Advertisement
Advertisement