అక్షరటుడే, ఇందూరు: జైహింద్ నినాదంతో దేశభక్తిని చాటిన మహోన్నత వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని శబ్ద తరంగిణి సంస్థ అధ్యక్షుడు దయానంద్ అన్నారు. బుధవారం సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని సంస్థ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగి గురువా రెడ్డి, గోవర్ధన్ గౌడ్, సురేష్, ప్రవీణ్ కుమార్, లింబాద్రి, బాబురావు, దయానంద్, విఠల్, తదితరులు పాల్గొన్నారు.