అక్షరటుడే, ఇందూరు: వికలాంగ ధ్రువీకరణ శాతాన్ని పునఃపరిశీలించాలని తెలంగాణ వికలాంగుల వేదిక అధ్యక్షుడు సాయిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో సదరం క్యాంపులో నిర్ధారణ చేసినప్పుడు తమకు తక్కువ శాతం సర్టిఫికెట్ వచ్చిందన్నారు. మరోసారి అవకాశం కల్పించి పునఃపరిశీలించాలని కోరారు. ఇప్పటికే తమకు అన్యాయం జరిగిందన్నారు. ఫిర్యాదు ఇచ్చిన వారిలో రమేశ్, ముత్యం, రాణి, లక్ష్మి తదితరులున్నారు.