అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: రామారెడ్డి మండలం రంగంపేట రైల్వే గేటును మూడు రోజులపాటు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరమ్మతుల దృష్ట్యా ఈనెల 4 నుంచి 6 వరకు రైల్వే గేట్ నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహన చోదకులు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలని సూచించారు.