అక్షరటుడే, ఇందూరు: నర్సింగ్​పల్లిలోని ఇందూరు తిరుమలలో మంగళవారం రథ సప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోవింద వనమాల క్షేత్రంలో స్వామివారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్య, విజయ్ స్వామి, రాజేశ్వర్, భూం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.