రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ పరిస్థితి విషమం

0

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: కమిషనరేట్ కు చెందిన ఓ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బోధన్ లో నివాసం ఉండే ఏఆర్ కానిస్టేబుల్ శంకర్ నిజామాబాద్ లోని ఈవీఎంల గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం విధుల నిమిత్తం బోధన్ నుంచి నిజామాబాద్ కు బయలుదేరాడు. అర్సపల్లి ధర్మకాంట వద్ద ఓ వాహనం ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. మొదట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. తలకు బలమైన గాయలవ్వగా మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు చెప్పడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ప్రమాద ఘటనపై నిజామాబాద్ ఆరో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.