అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పిట్లం మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన సుమన్(24) తన స్నేహితుడితో కలిసి బైక్ పై బాన్సువాడకు వచ్చాడు. రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద జరిగిన బస్సు యాక్సిడెంట్ ఘటనలో దుర్మరణం చెందాడు. వాహనం నడుపుతున్న మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. బాన్సువాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.