అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సీఎం రేవంత్‌ అధ్యక్షతన సోమవారం భేటీ అయిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్‌ 28న భూమిలేని వారికి రూ.6 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. సంక్రాంతి తర్వాత కొత్తరేషన్‌ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే కేటీఆర్‌ ఈ-ఫార్ములా రేస్‌ నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్‌ ఆమోదం తెలిపారని తెలిపిన కేబినెట్ సీఎస్‌ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని పేర్కొంది.