అక్షరటుడే, కోటగిరి/బోధన్/ఆర్మూర్: జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులో పలువురికి ఆయా కోర్టు జడ్జిలు జైలుశిక్ష విధించారు. కోటగిరి పరిధిలో కొండాపూర్‌కు చెందిన నీరడి సుధాకర్‌కు రెండురోజులు, బోధన్ పరిధిలో ముగ్గురికి మూడు రోజుల జైలుశిక్ష విధించగా, ఆర్మూర్ పీఎస్ పరిధిలో మరాఠ నగేష్, మాసం మహేష్, హెచ్ బాలాజీకి రెండురోజుల జైలుశిక్ష విధిస్తూ జడ్జిలు తీర్పు ఇచ్చారు.