అక్షరటుడే, వెబ్ డెస్క్: యూకెలో తీవ్రమైన మంచు, చలి తరంగం కొనసాగుతోంది. తూర్పు ప్రాంతాలు, స్కాట్లాండ్లో -20°C వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం, బుధవారం.. ఉత్తర స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్, దక్షిణ ప్రాంతంలో ఎల్లో అలర్ట్ అమల్లో ఉన్నాయి. గురువారం, ఉత్తర వేల్స్లో, మెర్సీసైడ్, చెస్టర్ ప్రాంతాల్లో మంచు కారణంగా కొత్త హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.
బ్రిటన్ దేశంలో అత్యంత ఎత్తైన పబ్ వద్ద.. 10 మంది ఉద్యోగులు, సందర్శకులు శనివారం రాత్రి నుంచి మంచులో చిక్కుకుపోయారు. వారిని వచ్చే వారం వరకు క్షేమంగా ఉండేలా చూడాలని సూచించారు. గత కొన్ని సంవత్సరాల్లో ఈ స్థాయిలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు.