అక్షరటుడే, కామారెడ్డి: ప్రతీ ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ సూచించారు. పల్లెల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో భాగంగా బుధవారం దోమకొండ మండలంలో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో మురికి కాల్వలు, పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా రోగాలు ప్రబలకుండా ఉంటాయన్నారు. స్పెషల్ డ్రైవ్ వారం రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్ రావు, డీఎల్పీవో సాయిబాబ, ఎంపీపీ కానిగంటి శారద, జడ్పీటీసీ తీగల తిర్మల్ గౌడ్, ఎంపీడీవో చిన్నా రెడ్డి, ఎంపీవీ తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.